మే నెలాఖరుకు తొలి విడతలో పోలవరం నిర్వాసితుల ఇళ్ల కాలనీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ డాక్టర్ టి. బాబూరావు నాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి, కుక్కునూరు, బుట్టాయిగూడెం మండలాల్లో నిర్మాణంలో ఉన్న నిర్వాసిత ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. కాఫర్ డ్యాం ఎగువ భాగంలో ఉన్న 41 కాంటూరు పరిధిలోని నిర్వాసిత గ్రామాలను తరలించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఏ, బి కేటగిరీలుగా విభజించి తొలి విడతలో ముంపునకు గురవుతున్న గ్రామాలను తరలించేందుకు 21 కాలనీలు మే నెలలో పూర్తి చేస్తామన్నారు. రెండో విడతలో 12 కాలనీలను జూన్- జూలై నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇసుక కొరతపై గుత్తేదారులు బాబూరావు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలకు ఆటంకం లేకుండా చేస్తామన్నారు.
ఇదీ చదవండి: