పశ్చిమగోదావరి జిల్లా పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం మండలంలో నాటుసారా స్థావరాలపై.. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కొయ్యలగూడెం మంగపతిదేవిపేటలో నాటుసారా కాస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెంకు తరలిస్తున్న 90 సీసాల మందు బాటిళ్లను స్వాధీనం తేసుకున్నారు. ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు. జీలుగుమిల్లి మండలంలో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా మద్యాన్ని తరలించడం, అమ్మడం లాంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: పాప కిడ్నాప్.. 5 గంటల్లో తల్లిదండ్రుల ఒడికి చేర్చిన పోలీసులు