పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వైఎన్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎం మహేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ 1, 2 ఆధ్వర్యంలో.. నిర్వహించిన జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వాలంటీర్లతో కలిసి మొక్క నాటిన ఆమె.. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు.
పురపాలక సంఘం అందించిన మొక్కలను వాలంటీర్లు.. కళాశాల ఆవరణం, రహదారులకు ఇరువైపుల నాటారు. వాలంటీర్లు, అధ్యాపకులు మొక్కలను సంరక్షణ కోసం దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్పీవోలు ఆర్వి సత్యనారాయణ, యాకోబు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: