పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో.. వాట్సాప్ స్టేటస్ ఓ యువకుడి ప్రాణం తీసింది. నల్లజర్లకు చెందిన ఓ వ్యక్తి తన ఫోటోను వాట్సాప్‌లో పెట్టి వేధిస్తున్నాడని మనస్తాపంతో గోపవరానికి చెందిన గౌరు శ్రీను అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చనిపోడానికి కారణాన్ని ముందుగా సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
ఆత్మహత్యకు ముందు గౌరు శ్రీను సెల్ఫీ వీడియో...
"నేనెవరినీ మోసం చేయలేదు...మోసం చేయాలని నాకు లేదు. డబ్బులు సమయానికి ఇవ్వలేకపోయాను. కానీ ఇస్తానని చెప్పాను. గత మూడు రోజులుగా వాట్సాప్ స్టేటస్‌లో నా ఫోటోలు పెట్టి నన్ను వేధించారు. నేనేదో దొంగతనం చేసి పారిపోయినట్లు.. ఓ దొంగలాగా నన్ను చిత్రీకరించాడు మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని కుటుంబం. వాళ్లందరూ డబ్బులు కోసం నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు . నేను ఇవ్వనని చెప్పట్లేదు.. ఇస్తానని చెప్పాను. టైం అడుగుతున్నాను, కానీ వాళ్లు చాలా ఇదిగా హింసిస్తున్నారు. నా చావుకు కారణం మెంతులపల్లి దుర్గాప్రసాద్, అతని కుటుంబసభ్యులు" అని సెల్ఫీ వీడియో తీసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.