పశ్చిమ గోదావరి జిల్లా రైతు బజార్లలో రాయితీపై ఉల్లి పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కొనుగోలు ప్రారంభమైన కొద్దిసేపటికే అనేక ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నాసిరకం ఉల్లి పంపిణీ చేస్తున్నారంటూ రైతు బజార్ల ఎస్టేట్ అధికారులను ప్రజలు నిలదీశారు.
నాణ్యతలేని ఉల్లిని పంచుతారా ??
ఏలూరులోని రెండు రైతు బజార్లలోనూ నాణ్యతలేని ఉల్లిని పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమయ్యాయి. కిలో రాయితీ ఉల్లి కోసం గంటల కొద్దీ వరుసల్లో నిల్చున్నా.. సరైన ఉల్లిని అందించట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.