కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని నిబంధన విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏ ఆధార్ కేంద్రం వద్ద చూసినా జనాలు బారులు తీరారు. ప్రతి రోజు వందల సంఖ్యలో ఒక్కసారిగా కేంద్రాల వద్దకు వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. నాలుగైదు చోట్ల తిరిగినా సరే..ఎక్కడా ఆధార్ లింక్ కాకపోవటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క కరోనా విజృంభిస్తున్నా..ఆధార్ లింక్ కోసం వచ్చిన వారు కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. వైయస్సార్ చేయూత పథకానికి అర్హులమైనప్పటికీ ఆధార్ నమోదు లేకపోవడంతో లబ్ది పొందలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: