కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా... దేశవ్యాప్తంగా రెండు కోట్ల మందితో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు తెలిపారు. కడప జిల్లా రాజంపేట కాంగ్రెస్ కార్యాలయంలో జరిగన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పార్లమెంటులో రైతాంగానికి సంబంధించి భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ బిల్లుల ద్వారా రైతులకు నష్టం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు. వైకాపా, తేదేపా, జనసేన నాయకులు కేంద్రం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: