పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పి.సుబ్బారావు అనే వృద్ధుడు పోలీస్ స్టేషన్ కూడలి వద్ద ఆందోళనకు దిగాడు. స్థలం విషయంలో జరిగిన వివాదంలో తనపై వైకాపాకు చెందిన నాయకుడు దాడి చేసాడని ఆరోపించాడు. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ... అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టాడు. పోలీస్స్టేషన్ లో కేసు నమోదు చేసి నేటికి పది రోజులు గడుస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితుడు వాపోయాడు.
ఇదీచదవండి.