రైతు భరోసాతో అన్నదాతలకు మొత్తంగా రూ.26 వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పథకం సొమ్ములో ప్రభుత్వ కోత వల్ల 5 ఏళ్ల కాలంలో ఒక్కో రైతు 25 వేలు నష్టపోతున్నారని ఆయన అన్నారు. అమరావతిలో మాట్లాడిన నిమ్మల రామానాయుడు.. రైతు భరోసా పథకంపై ప్రభుత్వం రోజుకో మాట మారుస్తోందని మండిపడ్డారు. శాసనసభలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని ప్రకటించి, కేవలం 3 లక్షల మందికి మాత్రమే పథకాన్ని వర్తింపజేశారని ఆగ్రహించారు. ఇది రైతు భరోసా పథకం కాదన్న ఆయన రైతు మోసం పథకమే అని దుయ్యబట్టారు. సంవత్సరానికి 50 వేల రూపాయలు ఇస్తామని చెప్పి 30 వేలకు పరిమితం చేయటం మాట తప్పి మడమ తిప్పటమేనన్నారు. ప్లీనరీలో ప్రకటించిన విధంగా 12,500 రూపాయలు కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి