పశ్చిమగోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు. మండలానికి ఒకటి చొప్పున 48 పోలింగ్ కేంద్రాలు, ఏలూరులో రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని అధికారులు పర్యవేక్షించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగాయి. చింతలపూడి సర్కిల్ పరిధిలోని చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టీ నరసాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలో ఓట్లు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఈనెల 17న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు లెక్కించనున్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల ఫలితాలు