నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును తమ పార్టీ మనిషిగా గుర్తించడంలేదని.. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇంటి పట్టాల పంపిణీలో వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించారు.
రఘురామకృష్ణరాజు మనిషి ఒకచోట.. మనసు మరోచోట ఉందన్నారు. ఆయన తమ పార్టీని విమర్శించడం ప్రారంభించాక.. వైకాపా ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. మోదీ పాట పాడుతూ.. భాజపాలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: