పేద విద్యార్థులకు రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడం ఎంతో అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. కరోనా సమయంలో ట్రస్ట్ సేవలు మరువలేనివని ప్రశంసించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలతో పాటు రాజ్ ట్రస్ట్ వంటి సేవా సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల పేదలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారు. ఇప్పటికే ఎంతోమంది పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు సంస్థ నిర్వాహకులు రాజ్ కుమార్ చెప్పారు. కరోనా సమయంలో లక్ష లీటర్ల రసాయనాలు పిచికారి చేయడం, పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయటం, వృద్ధులకు, వితంతువులకు పింఛన్ పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేశామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: