పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రమాదవశాత్తు కాలువలో కొట్టుకుపోయిన యువకుడి మృతదేహం లభ్యమైంది. తణుకు పెద్ద వంతెన వద్ద స్నేహితులతో పాటు స్నానానికి దిగి, ఇరగవరం కాలనీకి చెందిన ధనరాజు గల్లంతయ్యాడు. యువకుడి కోసం నిన్నటి నుంచి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెతుకుతున్నారు. చివరికి పడిన చోటు నుంచి అర కిలోమీటరు దూరంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీచూడండిగోస్తాని కాలువలో యువకుడు గల్లంతు