కరోనా నేపథ్యంలో రైతులకు న్యాయం చేసేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. విజయవాడ వన్ టౌన్‌లోని డెయిరీ కార్యాలయంలో పాలక మండలి సమావేశం నిర్వహించారు. రైతులకు చెల్లించే పాల ధరను లీటరుకు 60 నుంచి 65 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. 60 ఏళ్లుగా కృష్ణా మిల్క్ యూనియన్ని నమ్ముకుని పాలు అందిస్తున్న రైతులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఫలితంగా యూనియన్‌పై 25 కోట్ల భారం పడుతుందని...అయినా రైతుల శ్రేయస్సు దృష్టిలో పెట్టకుని..పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత రైతులకు మేలు జరుగుతుందన్నారు. మరోవైపు రైతులకు 20 కోట్ల రూపాయల బోనస్ కూడా ఇవ్వడానికి సభ్యులు అంగీకరించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు