ఏలూరులోని ఏఆర్డీజీకే బడిలో 600 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం సరఫరాలో... నాణ్యతలేదని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెత్తబడిన అన్నం, నీళ్ల చారు... అందులో పురుగులు.. ఉడకని గుడ్లు ఇలాంటి ఆహారమే మధ్యాహ్న భోజనం కింద వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఆహారాన్ని చూస్తూ తినలేక చెత్త డబ్బాలో వేస్తున్నారు. మరికొందరమే... ఆకలిబాధ తట్టుకోలేక... పురుగులతో ఉన్న ఆహారాన్ని తింటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడికి పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. అయినా వారు పట్టించుకోలేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పిల్లలు ఈ తరహా భోజనం తింటే వారి ఆరోగ్యాలు ఏమైపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఇబ్బందులు చూడలేక ఇంటి నుంచి పచ్చళ్లు తయారు చేసి పంపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా నాణ్యమైన భోజనం సరఫరా చేయాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇవీ చదవండి