పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో 400 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో ఇంకా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నిత్యావసరాల కొనుగోలుకు వారానికి మూడు రోజులు మాత్రమే కేటాయించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు సమయంలో దుకాణాలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో పూజ సామాగ్రి, పండ్లు, పత్రి కొనేందుకు ఒక్కసారిగా ప్రజలు బయటకు రావడంతో రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. దీంతో సామాజిక దూరం కరువైంది.
ఉదయం 6 నుంచి 11గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతి ఇవ్వడంతో... వివిధ ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రజలు నరసాపురం వస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని పదేపదే అధికారులు చెబుతున్నా ప్రజలు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి;