Man Suicide in West Godavari District: ఓ కేసు విషయంలో స్థానిక ఎస్సైతో పాటు వైకాపా నాయకులు.. తనను వేధిస్తున్నారంటూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో చోటు చేసుకుంది. ఆకివీడు మండలం కుప్పనపూజి గ్రామానికి చెందిన బూరగ నాగేశ్వరరావును కేసు విషయంలో పదిలక్షలు ఇవ్వాలని వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిన్న రాత్రి ఎస్సై పోలీస్ స్టేషన్కు పిలిచి బెదిరించినట్టు వారు తెలిపారు.
ఎస్సై, వైకాపా నాయకులు పది లక్షలు ఇవ్వాలని తనను వేధిస్తున్నట్టు బాధితుడు సూసైడ్ నోట్లో రాయటంతో పాటు, ఫోన్‌లో ఆడియో రికార్డు చేసి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతని మృతితో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు.. ఆకివీడు పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.
ఇవీ చదవండి: