RRR Phone Tapping Issue: వైకాపా ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేస్తోందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు చేసిన ఫిర్యాదుపై లోక్‌సభ కార్యాలయం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ వివరణను ఫిర్యాదుదారుకు అందిస్తారో లేదో చెప్పాలని కోరింది. ఫోన్ ట్యాపింగ్‌తో.. తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ ఈనెల 8న రఘురామ చేసిన ఫిర్యాదుపై.. లోక్‌సభ కార్యాలయం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇవీ చదవండి: