ETV Bharat / state

స్థానిక ఎన్నికల నిర్వహణకు ముమ్మర కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమయ్యింది. మార్చి నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

local body elections details in west godavari district
పంచాయితీ ఎన్నికలకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు
author img

By

Published : Mar 4, 2020, 4:21 PM IST

పంచాయితీ ఎన్నికలకు పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో.. హైకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన పనిపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ముందుగా ఎస్టీలు.. తర్వాత ఎస్సీలు.. తదనంతరం బీసీలకు రిజర్వేషన్లు ఖరారు పూర్తి చేసిన తర్వాత జనరల్ పై దృష్టి సారించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 5 రెవెన్యూ డివిజన్లలో 48 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 899 గ్రామ పంచాయతీలు, 9859 వార్డులు ఉన్నాయి. తాజాగా తయారు చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 24, 17, 567 మంది ఓటర్లు ఉన్నారు.

జిల్లాలోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల పోలింగ్ కేంద్రాల గుర్తింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. గతంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన యంత్రాంగం.. ప్రస్తుతం రిజర్వేషన్లు మారినందున మరోసారి పోలింగ్ కేంద్రాలను గుర్తించవలసిన అవసరం ఏర్పడింది. జిల్లాలో సుమారుగా పది వేల పోలింగ్ కేంద్రాలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

200 లోపు ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 4100, 400 లోపు ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 5100, 400 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 800 ఉంటాయని అధికారులు అంచనా వేశారు. ఈ నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయకపోతే ఆర్థిక సంఘం నిధులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున.. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'రిజర్వేషన్లపై సుప్రీం కోర్టుకు వెళ్లే సమయం లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.