మూడు మండలాల్లో నూరు శాతం స్థానాలు వారివే..
మన్యంలో పాలనాపగ్గాలు ఆదివాసీలకే దక్కనున్నాయి. పశ్చిమ మన్యంలో 71 గ్రామపంచాయతీలు ఉండగా, అందులో 66 స్థానాలు వారికే రిజర్వు చేశారు. అయిందింటిలో మాత్రమే ఇతరులకు అవకాశం దక్కబోతోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, పోలవరం మండలాల్లోనే ఈ అయిదు పంచాయతీలు ఉన్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు మండలాల్లో నూరుశాతం స్థానాలు ఆదివాసీలకే కేటాయించారు. ఏజెన్సీలో ప్రత్యేక చట్టాల ద్వారా మన్యం గిరిజనులకు ఈ అవకాశం ఏర్పడింది. వార్డులలో మాత్రం ఇతరులు పోటీచేసే వెసులుబాటు ఉంది. కులగణన ప్రకారం కేటాయింపులు జరిగిన నేపథ్యంలో గిరిజనేతరులకు వార్డుల్లో పోటీచేసే అవకాశం ఏర్పడింది. అయితే ఉపసర్పంచులుగా గిరిజనేతరులను ఎన్నుకొనే అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: