విద్యకు అన్నీ సమానమేనని ప్రైవేట్... ప్రభుత్వ పాఠశాలలు అంటూ తారతమ్యాలు లేవంటున్నారు ప.గో జిల్లా ఏటీడీఏ ఉపకలెక్టర్ హరీంద్రియ ప్రసాద్. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించగలిగే స్థోమత ఉండి సైతం.. ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకంతో కన్నాపురం మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో చేర్పించారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అందరి లాగే నా కుమారుడు...
అందరి పిల్లల్లాగే..తన కుమారుడు సైతం ప్రభుత్వ విద్యను అభ్యసించాలని ఉపకలెక్టర్ కోరుకుంటున్నారని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడి గురువులు... తమ పిల్లలను ఇక్కడే విద్యనభ్యసించేలా చేస్తుడటం మరో ప్రత్యేకత. ప్రభుత్వ ఉద్యోగులు... సర్కారీ బడుల్లో తమ పిల్లలను చేర్పించినప్పుడే సామాన్యులకు నమ్మకం కలుగుతుందని... ఆ విధంగా అడుగులు వేయాలంటున్నారు ఇక్కడి గురువులు.