ETV Bharat / state

ఎస్ఈబీ దాడిలో భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

మద్యం అక్రమ రవాణాను నివారించడానికి అధికారులు ఎంత ప్రయత్నిస్తున్నా.. వ్యాపారులు కొత్త మార్గాలను వెతుకుతూనే ఉన్నారు. తెలంగాణ నుంచి మద్యాన్ని తరలించి ఏపీలో విక్రయిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

seb seized telangana liquor
ఎస్​ఈబీ స్వాధీనం చేసుకున్న తెలంగాణ మద్యం
author img

By

Published : Oct 23, 2020, 9:07 AM IST

తెలంగాణ మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని.. ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో అతడి నుంచి 122 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

తుంపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి తెలంగాణ నుంచి మద్యం తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నాడు. ఎస్ఈబీ ఏలూరు సీఐ ధనరాజ్​కు సమాచారం అందగా.. సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. అతని ఇంటి వద్ద నుంచి 90 క్వార్టర్, 20 నిప్స్ బాటిళ్లతో పాటు 12 బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

ఇదీ చదవండి:

పెనుగొండలో ఏసీబీకి చిక్కిన ప్రధానోపాధ్యాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.