ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కుల ధ్రువీకరణ పత్రం విషయంలో 4 వారాలలోపు దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని.. పశ్చిమగోదావరి జిల్లా కేఆర్ పురం ఐటీడీఏ పీవోకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని ఎస్టీ ఉద్యోగ సంఘాల లీగల్ అడ్వైజర్ రేగు మహేశ్వరరావు ఆగస్టు 24న పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆర్కే. పురం ఐటీడీఏ పీవో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. అయితే ఇంతవరకు దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ విషయంపై ఈనెల నవంబర్ 23న మహేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈ విషయాన్ని ఐటీడీఏ పీవోను దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఇవీ చదవండి..