పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో కరోనా విజృంభిస్తోంది. మండల పరిధిలోనే 1100కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రారంభ దశలో ఒక్క పాజిటివ్ రానప్పటికి...మే 4న వారణాసి నుంచి వచ్చిన నలుగురికి కరోనా నిర్ధారణ అయింది. వారిని నేరుగా క్వారంటైన్‌కి తరలించారు. అయినప్పటికీ గత 5 నెలల్లో 1133 కేసులు నమోదయ్యాయి.
చిన్న గ్రామాలలో కూడా వందల సంఖ్యలో కేసులు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. మండల కేంద్రంలో178 కేసులు నమోదు కాగా ...పాలంగి అనే చిన్న గ్రామంలో 168 ఉండటం కొవిడ్‌కు దర్పణం పడుతోంది. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు తాము ఎంతో శ్రమిస్తున్నప్పటికీ ప్రజలు బేఖాతరు చేయడంతో... పరిస్థితి తీవ్రరూపం దాల్చిందని అధికారులు వాపోతున్నారు.
ఇదీ చదవండీ...సాహస క్రీడలకు చిరునామా.. మన గండికోట