పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 4 లక్షల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలకత్తా నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి గుట్కా ప్యాకెట్లను నిత్యావసర వస్తువుల పేరుతో అక్రమంగా లారీలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై లారీని పట్టుకున్నారు. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గుట్కాల విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: