పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ మాసూళ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి యంత్రాలు రాని కారణంగా.. మందకొడిగా పనులు మొదలయ్యాయి. వాటికి తోడు అకాల వర్షం కొంత అంతరాయం కలిగించింది. ప్రస్తుతం నేల ఆరిపోవటమే కాక.. ఇతర ప్రాంతాల నుంచి యంత్రాలు రావడానికి అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఫలితంగా జిల్లా అంతటా రబీ మాసూళ్ల పనులు వేగవంతమయ్యాయి. యంత్రాలతో కోసిన ధాన్యాన్ని పొలాల్లోనే కాటా వేసి కొనుగోలు కేంద్రాల సహాయంతో మిల్లులకు తరలిస్తున్నారు.
ఇదీ చూడండి: