పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో వరద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోలవరం మహా నందీశ్వర స్వామి ఆలయం వద్ద గండి పడగా.. స్పిల్‌వే ద్వారా స్పిల్ ఛానల్‌కు నీరు భారీగా చేరుకుంది. ప్రస్తుతం స్పిల్ ఛానల్ ప్రాంతం జలాశయాన్ని తలపిస్తోంది. కొత్తూరు కాజ్ వే వద్ద వరద నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. స్పిల్ వేలో గడ్డర్ల ఏర్పాటుకు, బ్రిడ్జి నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.
ఇవీ చదవండి: