గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 48 అడుగులకు పైగా చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు దిగువకు వస్తుండడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి తీర ప్రాంత గ్రామాలు వణుకుతున్నాయి. పెరవలి మండలం తీపర్రు, కాకర పర్రు తదితర గ్రామాల వెంబడి గోదావరి ఏటిగట్టున అనుకొని ప్రవహిస్తోంది. ఈ ఉధృతి మరింత పెరిగితే తమని ఎక్కడ ముంచెత్తుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి