ETV Bharat / state

వేమవరంలో గ్యాస్ లీకేజీ.. భయాందోళనలో ప్రజలు - పశ్చిమగోదావరిలో గ్యాస్ లీకేజీ వార్తలు

విశాఖలోని ఎల్జీ పాలీమర్స్ ఘటన మరువకముందే మరో గ్యాస్ లీకేజీ.. తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని వేమవరంలో బోర్ కు మరమ్మతులు చేస్తుండగా లీకేజీ జరిగింది. గ్రామస్తులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

Gas leakage at  Vemavaram, Achanta mandal in West Godavari

author img

By

Published : May 27, 2020, 11:25 AM IST

Updated : May 27, 2020, 12:02 PM IST

తాగునీటి బోరు నుంచి గ్యాస్ లీకేజీ కావడం... స్థానికులలో భయాందోళన కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం పాలకొల్లు రహదారిలోని.. బొక్క సత్యనారాయణ తన ఇంటి ఆవరణలో ఏడాది క్రితం మంచినీరు బోరు వేయించారు. సుమారు ఆరు నెలల నుంచి వినియోగించడం మానేశారు.

వేసవి కారణంగా తాగునీటి సమస్య తలెత్తడంతో బుధవారం ఉదయం బోరుకు మరమ్మతులు చేపట్టారు. భూమిలోని గొట్టాలు లాగుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ బయటకు వెలువడటంతో.. స్థానికులంతా భయంతో పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్థులను ఖాళీ చేయించారు. రాజమండ్రి ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందజేశారు. ప్రస్తుతం కాస్త గ్యాస్ ఉద్ధృతి తగ్గినప్పటికీ.. అధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.

ఇదీ చదవండి:

మటన్​ వ్యాపారి ఇంట వేడుక... 22 మందికి కరోనా

Last Updated : May 27, 2020, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.