కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం నుంచి తమిళనాడులోని తంజావూరుకు నిందితులు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు.
ఇదీచదవండి
విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆందోళన