కుండపోత వర్షాలతో పశ్చిమగోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. గుండేరు వాగుకు పది వేల క్యూసెక్కుల వరద రావడంతో దెందులూరు సమీపంలోని 16 నెంబరు జాతీయ రహదారిపైకి నీరు చేరింది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రద్దీగా ఉండే జాతీయ రహదారిపై వరదనీరు వెళుతోంది. జిల్లాలో జలశయాల నుంచి వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో లోతట్టు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. జిల్లాలో వరదల పరిస్థితిపై మా ప్రతినిధి రాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు.
ఇదీ చదవండీ.. KOPPARU INCIDENT: కొప్పర్రు ఘటన..25 మంది అరెస్ట్