పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో ఉన్న లక్ష్మీ సమన్విత పోలిమెర్స్ (థర్మోకోల్ పరిశ్రమ)లో ఈ తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం, భీమడోలు నుంచి అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమకు చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.
కోట్లలో ఆస్తినష్టం ఉంటుందని యాజమాన్యం అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఇదే పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి :