ETV Bharat / state

షార్ట్ సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం.. కాలిపోయిన టైర్లు

author img

By

Published : Jan 10, 2021, 4:49 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వంద టైర్లు మంటల్లో కాలిపోయాయి.

Fire accident
అగ్ని ప్రమాదం

ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురంలో షార్ట్ సర్క్యూట్​ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టైర్ల దుకాణం ముందు ఉంచిన సుమారు వంద టైర్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

ఏం జరిగింది..

తిమ్మాపురం గ్రామ శివారు వేయింగ్ బ్రిడ్జి సమీపంలో టైర్ల షాప్ ముందు పాత టైర్లు ఉంచారు. వాటికి సమీపంలోని విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి నిప్పురవ్వలు టైర్లపై పడ్డాయి. ఫలితంగా అగ్గి రాజుకుని.. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే సుమారు 100 టైర్లు మంటల్లో కాలిపోయాయి.

ఇదీ చదవండి: గాలాయగూడెంలో ఇద్దరు బాలురు అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.