పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం సమీపంలోని గోదావరిలో ఓ వ్యక్తి... తన ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తొమ్మిదేళ్ల కుమార్తె, ఏడేళ్ల కుమారునితో కలిసి గోదావరిలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై తన పిల్లలతో సహా గోదావరి ఒడ్డుకు చేరిన వ్యక్తి... స్థానికులు గుర్తించే లోగా నదిలోకి దూకినట్లు సమాచారం.
అప్రమత్తమైన స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. గల్లంతైన ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ చిరునామా ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
WIFE KILLED HUSBAND: పప్పు కోసం గొడవ..కత్తి గుచ్చుకొని భర్త మృతి