పంట నష్టానికి ప్రభుత్వ సాయమందించే సమయంలో... సిబ్బంది నిర్లక్ష్యంతో పరిహారం అందలేదని రైతన్నలు వాపోతున్నారు. తమ పంటలకు గత మూడు ఏళ్ల నుంచి పంట నష్ట పరిహారం రాలేదని వాపోతున్నారు. పంట నష్టపోయిన తమకు కాకుండా.. వేరే వారి ఖాతాల్లో నగదు పడటం ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెద్ద పంచాయతీలో చిట్టవరంలో జరిగింది.
ఖరీఫ్‌లో కురిసిన అధిక వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు అందించేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి నష్టం అంచనా వేశారు. అర్హులైన రైతులకు పరిహారం అందకుండా.. అనర్హులకు లబ్ధి చేకూరింది. దీంతో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఘటనపై రైతులు అధికారులకు వినతులు అందజేశారు. వీఆర్ఏ పోలిశెట్టి నరేంద్రనే దీనికి కారణమని భావిస్తున్న రైతులు.. చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవ చదవండి