డాక్టర్ వైయస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద 2020 ఖరీఫ్ సీజన్లో నష్టపోయిన పశ్చిమగోదావరి జిల్లా రైతులకు పరిహారం లభించనుంది. ఈ పథకం కింద రైతులకు నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రభుత్వం నేడు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. 2020 ఖరీఫ్ సీజన్లో లో అధిక వర్షాల కారణంగా వరి పండించే అన్నదాతలు పంట నష్ట పోయారు. ఆ సీజన్లో జిల్లాలో లక్షా రెండు వేల 140 మంది రైతులు.. లక్షా యాభై వేల ఎకరాల్లో పంట నష్ట పోయారు. అప్పట్లో అధికారులు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ మేరకు నష్టపోయిన రైతులకు 169 కోట్ల రూపాయల మేర పరిహారాన్ని ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. పరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ.. సీలేరు నదిలో ఎనిమిది మంది గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం!