ETV Bharat / state

పాలకొల్లులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.7.85 లక్షల నకిలీ నోట్లు, రూ.40 వేలు నగదు, ముద్రణకు ఉపయోగించే సామగ్రితో పాటు అయిదుగురిని అరెస్టు చేశామని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

Fake currency group arrest in palakollu west godavari district
పాలకొల్లులో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు
author img

By

Published : Jun 29, 2020, 4:39 PM IST

రాజమహేంద్రవరానికి చెందిన ఎడ్ల వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా కడియంపావరానికి చెందిన గుత్తుల వెంకటరమణలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలైన అనంతరం.. వీరు దొంగనోట్లను తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. పాలకొల్లు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని గుర్తించిన సీఐ ఆంజనేయులు పోలీసు సిబ్బంది సహాయంతో పట్టుకున్నారు. అనంతరం వీరిని స్టేషన్​కు తరలించామన్నారు. వీరి నుంచి రూ.7.85 లక్షల నకిలీ నోట్లు, రూ.40 వేలు నగదు, ముద్రణకు ఉపయోగించే సామగ్రితో పాటు అయిదుగురిని అరెస్టు చేశామని తెలిపారు.

ఇదీచదవండి.

మంత్రి పేర్నినాని ముఖ్య అనుచరుడిపై హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.