పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు మండలంలోని కొత్త పాత నవరసపురం గ్రామాల్లో పర్యటించారు. ముంపు బాధితులను పరామర్శించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మూడు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న ప్రజలను పరామర్శించేందుకు అధికార పార్టీ నేతలు రాకపోవడం దారుణమన్నారు.
బాధితులకు కనీసం తాగేందుకు మంచినీరు కూడా సరఫరా చేయకపోవడం సరి కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటమునిగిన గ్రామ ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించి సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతుల్ని పూర్తిస్థాయిలో ఆదుకోవాలన్నారు.
ఇదీ చదవండి: