పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేశారు. 20 నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని.. వెంటనే బకాయిలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న 270 జీవోను రద్దు చేయాలని నినదించారు. పురపాలక కమిషనర్, ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు.