ఇదీ చదవండి
మీ ఓటు అభివృద్ధికా? అవినీతికా?: పాల్ - కే.ఏ.పాల్
అభివృద్ధికి ఓటేస్తారా... లేదంటే అవినీతికి ఓటేస్తారా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్.. ప్రజలను ప్రశ్నించారు. తన పేరున ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్
లక్షల కోట్లు దోచుకున్న వారికి ఓటేస్తారా... లక్షల కోట్లు సంపాదించి దానం చేసిన వారికి ఓటేస్తారా... అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ ప్రజలను ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న నామినేషన్ల పరిశీలనకు హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడారు. తన పేరున ఎలాంటి ఆస్తులు లేవని స్పష్టం చేశారు. ఉన్న ఆస్తులన్నీ చారిటబుల్ ట్రస్ట్‌కు దానం చేసినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని తన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నట్టు చెప్పారు. అవినీతి పార్టీలకు ఓటెయ్యెద్దని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి
sample description