ETV Bharat / state

అకాల వర్షాలు.. పంట నీటి పాలు - అకాల వర్షాలకు పంట నష్టం వార్తలు

జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న, వేరుశనగ, పొగాకు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు తీరని నష్టం మిగిలింది.

Premature rain at west godavari
పశ్చిమ గోదావరి జిల్లాలో అకాల వర్షాలకు పంట నష్టం
author img

By

Published : Apr 27, 2020, 2:13 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు వరి పంట 81 హెక్టార్లలో నేల వాలింది. 54 హెక్టార్లలో ధాన్యం తడిసింది. 130 హెక్టార్లలో మొక్కజొన్న, 19 హెక్టార్లలో వేరుశనగ, 4 హెక్టార్లలో పొగాకు పంటకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా గుర్తించినట్లు జేడీఏ గౌసియాబేగం తెలిపారు. ద్వారకా తిరుమల మండలంలో 29 హెక్టార్లలో అరటి పంట దెబ్బతిందని ఉద్యానశాఖ డీడీ సుబ్బారావు వెల్లడించారు.

షెడ్డు కూలి యాచకుడి మృతి

భీమడోలు మండల వ్యాప్తంగా శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భీమడోలు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫాంపై షెడ్లు కుప్పకూలాయి. ఆ సమయంలో ఓ షెడ్డులో విశ్రాంతి తీసుకుంటున్న యాచకుడు బోలేబాబా (65) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

తాడేపల్లిగూడెం మండలంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి కళ్లాల్లో ఆరబెట్టిన 420 క్వింటాళ్ల ధాన్యం పాక్షికంగా తడిసిందని మండల వ్యవసాయాధికారి ఆర్‌.ఎస్‌.ప్రసాద్‌ ఆదివారం తెలిపారు. రానున్న నాలుగురోజుల్లో వర్షాలుపడే అవకాశాలున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో మండలంలోని తూర్పుయడవల్లి, నల్లగోపువారిగూడెం, కొండగూడెం, పాతూరు, కామవరపుకోట గ్రామాల్లో కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

ఇవీ చూడండి:

'చేయూతనివ్వండి... గెలిచి చూపిస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.