పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కవ్వకుంటకు చెందిన జయరాజు(36), వెంకమ్మ(25)లు దంపతులు. భర్త అరటి పండ్ల వ్యాపారం..భార్య కూలీ పనులే ఆ కుటుంబానికి ఆదాయ వనరు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. ఆర్థిక సమస్యలో..మరింకేం బాధలో తెలీదు తరచూ ఘర్షణ పడేవారని వెల్లడైంది. ఆ కుటుంబ కలహాలే వారి ఆత్మహత్యకు కారణమయ్యాయి. వెంకమ్మ ఇంట్లో ఉరేసుకుని చనిపోగా..ఆమె భర్త వరండాలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల మరణంతో వారి పిల్లలు అనాథలయ్యారని బంధువులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...కుటుంబ కలహాలతో తల్లీకొడుకు ఆత్మహత్య