దైవదర్శనానికి వెళ్తున్న భార్య భర్తలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. తణుకు పట్టణ ఇరగవరం కాలనీకి చెందిన నూలి సతీశ్, పర్వతవర్థని దంపతులు.. తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భార్య భర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఇదీ చదవండి: బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు !