పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నారీకేశ్వరపురం గ్రామానికి చెందిన సునంద అనే గర్భిణీకి 10 రోజుల కిందట కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది. గర్భిణీకి నొప్పులు రావడంతో ఏలూరు కోవిడ్ ఆసుపత్రిలో ఉదయం శస్త్రచికిత్స చేసి మగ బిడ్డను బయటికి తీశారు. బిడ్డకూ కరోనా పాజిటివ్ ఉంటుందన్న అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పసివాడికి కరోనా నెగిటివ్ రావడంతో తల్లిదండ్రులు, వైద్యలు ఊపిరి పీల్చుకున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనా రికవరీలో తెలుగు రాష్ట్రాలు భేష్