ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల సరిహద్దులో కరోనా పంజా - Corona positive cases in the borders news update

తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా కేసులు నమోదు కావడం పోలీస్​ సిబ్బందిలో ఆందోళన రేకెత్తిస్తోంది. జీలుగుమిల్లి సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల​కు కొవిడ్​ నిర్ధరణ కాగా ఇప్పటివరకు ఐదుగురు వైరస్​ బారిన పడ్డారు. దీంతో అధికారులు అయా ప్రాంతాల్లో నివారణ చర్యలు ముమ్మరం చేశారు.

Corona positive cases in the borders of Telugu states
తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో కరోనా పంజా
author img

By

Published : Jul 17, 2020, 9:07 PM IST

పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమిల్లి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వద్ద శుక్రవారం మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. మన్యం మెట్ట ప్రాంతాల్లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఇద్దరికీ రాపిడ్ పరీక్షలు నిర్వహించగా.. కరోనా నిర్ధరణ అయింది. బాధితులను ఏలూరు కొవిడ్​ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల వ్యవధిలో సరిహద్దులో ఐదు కరోనా కేసులు నమోదు కావడం పోలీసులు, వైద్య సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే సరిహద్దుల్లో కరోనా కేసులు నమోదు కావడంతో అధికారులు హైడ్రోక్లోరైడ్​ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.

ఇవీ చూడండి...

ప్రమాదం కాదు.. వేధింపులు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.