పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో విషాదం జరిగింది. కృష్ణా జిల్లా కలిదిండి మండలం చినతాడినాడ గ్రామానికి చెందిన కలిదిండి రాంబాబు (63)కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈనెల 4న నమూనాలు ఇవ్వగా ఇంకా ఫలితం రాలేదు.
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రాంబాబును అల్లుడు నరసింహులు శుక్రవారం ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని ఆకివీడు ఆసుపత్రికి బయలుదేరాడు. మార్గమధ్యలోనే రాంబాబు ఇలా వాహనంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఇదీ చదవండి: