conflict between woman and velugu staff: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన సీఎం సభకు డ్వాక్రా మహిళల తరలింపు వ్యవహరంలో ఒక మహిళ, వెలుగు సిబ్బందికి మధ్య మంగళవారం ఉదయం వివాదం చోటు చేసుకుంది. పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
తమ లక్ష్యానికి అనుగుణంగా డ్వాక్రా మహిళలను సమీకరించేందుకు వెలుగు సిబ్బంది నానా కష్టాలూ పడ్డారు. ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు సిబ్బంది కొందరు ఉదయాన్నే మహిళల ఇళ్లకు వెళ్లి సభకు రావాలంటూ ఒత్తిడి తెచ్చారు. స్థానిక వెలమపేటలో ఒక మహిళ ఇంటికి వెళ్లిన సందర్భంలో సదరు మహిళ తన భర్త ఒప్పకోరని, కుటుంబ సభ్యుల పనులను చక్కబెట్టి ఈ సమయంలో రావాలంటే కష్టమని చెప్పారు. కేవలం తమ గ్రూపు వారిని మాత్రమే రమ్మని డిమాండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా వారి మధ్య మాటల యద్ధం సాగింది. అక్కడివారు ఈ తతంగాన్ని రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ విషయం బయటకొచ్చింది.
ఇదీ చదవండి:
CM Jagan News: రూ.10 చెల్లిస్తే ఇంటిపై సర్వహక్కులు: సీఎం జగన్