పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు కట్టిదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నుంచి దుకాణాలు మూసివేశారు. ఈ నెలాఖరు వరకు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయల దుకాణాలే ఉదయం 11 గంటల వరకు అనుమతిస్తున్నారు.
పట్టణంలోకి ప్రవేశించే అన్ని వైపులా రహదారులు దిగ్బంధించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏ ఒక్కరూ రాకుండా చర్యలు చేపట్టారు. వైద్య సేవలు, ఔషధాల కోసం వచ్చేవారినే నిర్ధరించుకొని లోపలికి అనుమతిస్తున్నారు. పోలీసులు చేపట్టిన పకడ్బందీ చర్యలతో అన్ని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
ఇవీ చూడండి...