పేదలకు ఇళ్ల పట్టాలు అందించాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మధ్యలో కొందరు దళారులు రంగప్రవేశం చేసి రూ.20 వేల నుండి 60 వేలు వసూలు చేస్తున్నట్లు పశ్చిమగోదావరి జిల్లాలో ఫిర్యాదులు వచ్చాయి. అర్హత విషయంలో లోపాలున్న వారికి కొందరు గాలం వేసి, నగదు వసూలు చేస్తున్నట్లు తెలియడంతో దీనిపై నరసాపురం ఎంపీ, మంత్రి, కలెక్టర్ స్పందించారు. స్థలాల కోసం దళారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన వద్దకు ఫిర్యాదులు వచ్చాయని ఎంపీ తెలిపారు. ఈ అంశాన్ని తాను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఎవరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే 18002331077 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు. పోడూరు మండలంలో స్థలసేకరణ విషయంలో తమ పార్టీ వ్యక్తిపై ఆరోపణలు వచ్చి క్రిమినల్ కేసు నమోదు కావడంతో.. అతడిని వెంటనే పార్టీ నుంచి తొలగించినట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగితే పార్టీలతో ప్రమేయం లేకుండా క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులెవరూ ఇళ్ల పట్టాలు పొందేందుకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అన్నారు. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలని, అది రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
స్థలానికి డబ్బులడిగారా? ఫిర్యాదు చేయండి - west godavari dist
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్ధలాలు అందించటానికి కసరత్తు చేస్తోంది. సొంతింటి కల నేరవేర్చుకోవటానికి ఎందరో నిరుపేదలు వేచి చూస్తున్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమార్కులు ఇళ్ల పట్టాలకి అర్హత సాధించాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఫిర్యాదులు వస్తున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ స్పందించి టోల్ ఫ్రీ నంబరు 18002331077 ఏర్పాటు చేశారు. ఎవరైనా డబ్బలు అడిగితే ఫిర్యాదు చేయాలని తెలిపారు.