పశ్చిమ గోదావరి జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు రావటంపై అధికారులు ఆప్రమత్తమైయ్యారు. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రైవేటు వైద్యులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, వైకాపా కార్యకర్తలు, వర్తక వ్యాపార సంస్థలు, పోలీసులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. మరో 14 రోజులు ప్రతి ఒక్కరూ ఇళ్ల కే పరిమితం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సూచనలు జారీ చేశారు.
ఇప్పటికే జంగారెడ్డిగూడెంలో ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వ్యక్తిని తాడేపల్లిగూడెం ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో మరో కొంతమందిని గుర్తించేందుకు పురపాలక శాఖ పోలీసుల ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తమ వివరాలు తెలిపి ఐసోలేషన్ వార్డుకు వెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: